పెద్దకొడప్‌గల్: రా హుల్ గాంధీ ప్రధాని కావాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ కాటూరి వెంకటేశ్వర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్ర గురువారం బేగంపూర్ చౌరస్తా వద్దకు చేరుకుంది. పెద్ద కొడప్‌గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్రకు ఘన స్వాగతం పాలికారు. పార్టీ మండల అధ్యక్షుడు శామప్ప పటేల్, పార్టీ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్ సౌదగార్ అరవింద్, పార్టీ మండల మాజీ అధ్యక్షడు మహేందర్ రెడ్డి, నాయకులు బస్వరాజ్ దేశాయి, నాగిరెడ్డి, పండరి, మోహన్ తదితరులు ఉన్నారు.


