● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
నిజాంసాగర్(జుక్కల్): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని అచ్చంపేట శివారులో మంజీరా నదిపరీవాహక ప్రాంతంలో కల్వర్టు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గురువారం భూమి పూజ నిర్వహించారు. గతేడాది కురిసిన వర్షాలకు మంజీరా నదిలో వరద ప్రవాహంతో కల్వర్టు కొట్టుకుపోయింది. కల్వర్టు నిర్మాణానికి ఉపాధి హామీ కింద రూ. 50 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు ఎమ్మెల్యే చేతుల మీదుగా కల్వర్టు నిర్మాణ పనులకు భూమిపూజ చేపట్టారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్, సర్పంచ్ లక్ష్మయ్య, పార్టీ మండల అధ్యక్షుడు పండరి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను, రేషన్‌కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ భుజంగరావు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


