బాలికల కబడ్డీ జట్టు ప్రాబబుల్స్‌ ఖరారు | - | Sakshi
Sakshi News home page

బాలికల కబడ్డీ జట్టు ప్రాబబుల్స్‌ ఖరారు

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

బాలికల కబడ్డీ జట్టు ప్రాబబుల్స్‌ ఖరారు

వేల్పూర్‌(ముప్కాల్‌): ముప్కాల్‌ మండల కేంద్రంలోని భూదేవి ఇండోర్‌ స్టేడియంలో 22 మంది క్రీడాకారులతో జిల్లా జూనియర్‌ బాలికల కబడ్డీ జట్టు ప్రాబబుల్స్‌ను బుధవారం ఖరారు చేసినట్లు కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి లింగయ్య, గంగాధర్‌రెడ్డి తెలిపారు. జట్టుకు ఏర్గట్ల మండల కేంద్రంలో పీడీ జ్యోతి పర్యవేక్షణలో వచ్చే నెల 1 నుంచి 6 వరకు శిక్షణ నిర్వహించి, ఫైనల్‌ జట్టును ఖరారు చేస్తారన్నారు. ఫైనల్‌ జట్టు వచ్చే నెల 9 నుంచి 11 వరకు భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే అంతర్‌జిల్లా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ కబడ్డీ క్రీడాకారులు తిరుపతిరెడ్డి, ముప్కాల్‌ కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏలేటి విజయ్‌, పీడీలు అశోక్‌, ప్రసాద్‌, రాజ్‌కుమార్‌, అనురాధ, జ్యోతి, కవిత, అన్వేష్‌, స్పోర్ట్స్‌ అకాడమీ కోచ్‌ సాయిలు, సురేశ్‌, శ్రీకాంత్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement