ఆర్మూర్: మండలంలోని అంకాపూర్ గ్రామంలో లచ్చాగౌడ్, వీడీసీ ఫంక్షన్ హాల్‌లో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కర్ర గణపతి విగ్రహానికి సీపీ సాయిచైతన్య బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడుతూ గణేశ్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. ప్రజల భద్రతకు పోలీస్ శాఖ అన్ని రకాల భద్రతా చర్యలు చేపడుతోందని, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. సీపీ వెంట ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్, అంకాపూర్ సర్పంచ్ దేవేందర్, బుర్రన్న, రాజన్న, రమణారెడ్డి, హిందూ సేవా సమితి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


