ఆలుగడ్డల లారీ బోల్తా | - | Sakshi
Sakshi News home page

ఆలుగడ్డల లారీ బోల్తా

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

కామారెడ్డి రూరల్‌: కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని టేక్రియాల్‌ గ్రామ శివారు బైపాస్‌ రోడ్డుపై ఆలుగడ్డల లోడ్‌తో వెళ్తున్న లారీ బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి. దేవునిపల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్‌ నుంచి హైదరాబాద్‌ వైపు ఆలుగడ్డల లోడ్‌తో వెళ్తున్న లారీ టేక్రియాల్‌ బైపాస్‌ రోడ్డుపై అదుపుతప్పి బోల్తా పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న దేవునిపల్లి పోలీసులు గాయపడిన డ్రైవర్‌, క్లీనర్‌లను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement