మండల కేంద్రంలోని శివరాంమందిర్ ప్రాంతంలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు కాగా నిర్మాణం పూర్తి చేశా. ఇప్పటికి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇంటికి దూరంగా విద్యుత్ స్తంభాలు ఉన్నాయని, అదనపు విద్యుత్ స్తంబాలు బిగించిన తర్వాత ఇస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో నిర్మాణం పూర్తయినా గృహ ప్రవేశం చేయలేదు. విద్యుత్ కనెక్షన్ కోసం జీపీ, విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు.
– రేణుక, ఇందిరమ్మ లబ్ధిదారు, దోమకొండ


