● ఇంటి నిర్మాణాలు పూర్తయినా
కరెంట్ కరువు
● పట్టించుకోని అధికారులు
● ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు
దోమకొండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు విద్యుత్ కనెక్షన్లు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లు నిర్మించుకున్నా కరెంట్ లేకపోవడంతో చీకట్లోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
మండల కేంద్రానికి మొత్తం 164 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు సుమారు 30 మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మాణాలను పూర్తి చేశారు. అయితే ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా విద్యుత్ కనెక్షన్లు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు దోమకొండలో ఇంటి నిర్మాణం పూర్తయినా కరెంట్ కనెక్షన్ లేక ఇబ్బందులు పడుతున్న మరో 10 మంది లబ్ధిదారులు ఉన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి, కూలి పనులు చేసుకుంటూ ఇళ్లు నిర్మాంచుకున్నామని, ఇప్పుడు విద్యుత్ కనెక్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.


