బీబీపేట/సదాశివనగర్(ఎల్లారెడ్డి): జిల్లాలోని పలు మండలాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ వినియోగిస్తున్న డీజేలను పోలీసులు సీజ్ చేశారు. పలువురు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. బీబీపేట మండల కేంద్రంలో ఓ యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనానికి అనుమతి లేకుండా పెట్టిన డీజేను పోలీసులు పట్టుకున్నారు. స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. సదాశివనగర్ మండలంలోని ధర్మారావ్‌పేట్, అమర్లబండ గ్రామాల్లో డీజే నిర్వాహకులు, ఆపరేటర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా డీజేలు, ఇతర శబ్ద పరికరాలు వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


