లింగంపేట: సమాజ హితానికి మించిన మతం లేదని, ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని ప్రముఖ హైకోర్టు న్యాయవాది మోహిన్ అహ్మద్ ఖాద్రీ అన్నారు. మంగళవారం ఆయన లింగంపేట సరస్వతి శిశుమందిర్ విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పాఠశాల అభివృద్ధికి రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. భవిష్యత్తులో విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు అందజేస్తానని హామీ ఇచ్చారు. తను పుట్టిపెరిగి విద్యనభ్యసించిన ఊరు లింగపేట అని, గ్రామఅభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తున్నానని పేర్కొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆచార్యులు ఖాద్రీ కుటుంబ సభ్యులను సన్మానించారు. ఉపసర్పంచ్ ప్రసాద్‌గౌడ్, శిశుమందిర్ ప్రతినిధులు రాజారెడ్డి, ఆ నంద్, శ్రీనివాస్, దుర్గయ్య, శివ్వయ్య, ఉదేశ్, లక్ష్మీనారాయణ, బాలరాజగౌడ్, శ్రీకాంత్, చంద్రయ్య, సంజీవులు, రంజిత్ పాల్గొన్నారు.
భిక్కనూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ బోధన అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం రామేశ్వర్‌పల్లిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు హెచ్‌ఎం పద్మజ అందించిన స్కూల్ బ్యాగులు, క్రీడల డ్రెస్‌లను ఆయన పంపిణీ చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, సర్పంచ్ చేపూరి రాణి రాజు,ఉపసర్పంచ్ వినోద్‌కుమార్‌గౌడ్, ఎంఈవో రాజ్‌గంగారెడ్డి,వీడీసీ అధ్యక్షుడు సూర్యకాంత్‌రెడ్డి, కార్యదర్శి శ్యాం, టీచర్లు,వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఆర్‌యూబీ నిర్మించాలి
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం వికాస్‌నగర్ మీదుగా ఆర్‌యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జ్) నిర్మించాలని 29వ వార్డు కౌన్సిలర్ అంజాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ను సందర్శించడానికి వచ్చిన జీఎంకు సమస్యను వివరించి, వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు ఇమ్రాన్, లడ్డూ, స్థానికులు పాల్గొన్నారు.


