కామారెడ్డి అర్బన్: పాండిచ్చేరిలో నిర్వహించిన 37వ సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2026 అండర్–16 బాలుర విభాగం లాంగ్ జంప్‌లో రజత పతకం సాధించిన కామారెడ్డి మై నారిటీ పాఠశాల పూర్వ విద్యార్థి ఏ.అభిలాష్‌గౌడ్‌ను మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభినందించి స్పోర్ట్ మెటీరియల్ కోసం రూ.20వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎన్‌వై గిరి, జిల్లా క్రీడలు, యువజన అధికారి వెంకటేశ్వరగౌడ్, మైనారిటీ పాఠశాల ప్రిన్సిపల్ నాగరాజు చారి, పీఈటీ మనోజ్‌రెడ్డి, కోచ్ శివాగౌడ్, ఎస్‌ఎల్‌సీ భరత్ తదితరులున్నారు.
సేవలను సద్వినియోగం చేసుకోవాలి
మద్నూర్ : బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రవి అన్నారు. డోంగ్లీ బ్రాంచ్ తెలంగాణ బ్యాంకు మేనేజర్‌గా పనిచేసిన చంద్రకాంత్ బదిలీ కాగా, నూతనంగా మంగళవారం రవి మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్‌కుమార్, గ్రామస్తులు ఇద్దరిని ఘనంగా సన్మానించారు. సంతోష్‌కుమార్, హన్మంత్, బస్వరాజ్, అనిల్, నితిన్, ఆశోక్ తదితరులున్నారు.
కృత్రిమ మేధ పై వర్క్‌షాప్
రాజంపేట(భిక్కనూరు): రాజంపేట మండలం తలమడ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోబోటిక్స్, కృత్రిమ మేధపై మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లోకల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో బాఘంగా సోహం అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత ప్రయోగాలను చేయించారు.


