పెద్దకొడప్‌గల్: మండల కేంద్రంలోని తండాలో రోడ్లపై నిలిచిన మురుగునీరు చెరువులను తలపిస్తోందంటూ ఈ నెల 14న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు మంగళవారం రోడ్లుపై నిలిచిన నీటిని పొక్లెయిన్ సహాయంతో అధికారులు తొలగించారు. తాత్కాలిక మరమ్మతులు చేస్తుండటంతో తండావాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో పంచాయతీ కార్యదర్శి గీత చేపట్టిన పనులను అడ్డుకున్నారు. రోడ్లపైకి మురుగునీరు రాకుండా డ్రెయినేజీ నిర్మాణాలను చేపట్టాలని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన తర్వాతే పనులు చేయాలని వారు డిమాండ్ చేశారు. శాశ్వత డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేసే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వెంకట్, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.


