పెద్దకొడప్‌గల్/బీబీపేట/బాన్సువాడ రూరల్: వి నాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవా లని ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. మంగళవారం నిమజ్జనం చేసే చెరువును ఎస్సై పరిశీలించారు.ఎంపీడీవో అభినవ్ చెందర్,ఎంపీవో లక్ష్మీకాంత్ రెడ్డి, నాయకులు తదితరులున్నారు. బీబీపేట పెద్ద చెరువులో జరగనున్న గణపతి నిమజ్జనానికి పంచాయతీ పాలకవర్గం సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.చెరువు వద్ద ఉన్నటువంటి మహాంకాళి అమ్మవారి ఆలయం నుంచి చెరువు వరకు జేసీబీ ద్వారా రహదారి, పరిసరాలను శుభ్రం చేయించారు.సర్పంచ్ సాద్విక సాయినాథ్, ఉప సర్పంచ్ ప్రశాంత్, వార్డు సభ్యులు తదితరులున్నారు. గణేశ్ విగ్రహాల ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించాలని బాన్సువాడ అధికారుల బృందం కోనాపూర్‌లో మండప నిర్వాహకులకు సూచించారు. ట్రాలీ వాహనాలకు లీకేజీలు లేని నాణ్యతగల కేబుల్స్ ఉపయోగించాలని ట్రాన్స్‌కో ఏఈ అనిల్‌కుమార్ సూచించారు. సర్పంచ్ కిష్టవ్వ, నాయకులు దిల్‌రాజు, ఉప సర్పంచ్ ఉన్నారు.


