ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్: మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డులను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పంపిణీ చేశారు.మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, వైస్ చైర్మన్ మత్తమాల భాగ్యవతి, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, కౌన్సిలర్లు చంద్రయ్య, గఫార్, కోఆప్షన్ సభ్యులు పప్పు వెంకటేశం, గిర్దావార్ భరత్, కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్,రఫీక్, శంకర్, రాములు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు భూమిపూజ
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో మున్సిపల్ చైర్మన్ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సహకారంతో విడుదల చేసిన ఎస్‌డీఎఫ్ నిధులతో ముదిరాజ్ సంఘం భవన పనులకు రూ. 5 లక్షలు, మదర్సాకు రూ. 2 లక్షలు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు.
షీటీంకు సమాచారమివ్వాలి
ఎల్లారెడ్డిరూరల్: ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే విద్యార్థినులు షీటీంకు సమాచారం అందించాలని షీటీం పోలీసు సిబ్బంది అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో షీ టీం సభ్యులు విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు.ప్రిన్సిపాల్ తోట గాంధీ, వైస్ ప్రిన్సిపాల్ అల్తమాష్ జహంగీర్, ఉపాధ్యాయులు, తదితరులున్నారు.


