నిజాంసాగర్(జుక్కల్): టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంగళవారం ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, కాటిపల్లి నగేష్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తి కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మరింత సేవలు అందించాలని వారు కోరారు. డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
డిగ్రీలో ప్రవేశం కోసం స్పాట్ అడ్మిషన్
బాన్సువాడ రూరల్: మండలంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్‌ల కోసం నోటిఫికేషన్ విడుదలైందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందూర్ గంగాధర్ మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ఉంటుందని, ఇంటర్మీడియట్ పాసై డిగ్రీలో అడ్మిషన్ ఇప్పటివరకు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.


