కామారెడ్డి క్రైం: ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధి మెరుగుదల, స్వయం ఉపాధి కల్పనలో భాగంగా సీ్త్రనిధి రుణ సహాయం ద్వారా కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ ఆటోలను సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు రజిత, శోభలకు సీ్త్రనిధి ద్వారా రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షల రుణ సహాయం అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ సీ్త్రనిధి ద్వారా పొందిన రుణాలతో ఆదాయాన్ని సమకూర్చే ఉపాధి మార్గాలను ఎంచుకొని, కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్‌వై గిరి, డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి, అదనపు డీఆర్‌డీవో విజయలక్ష్మి, డీఆర్‌వో పాండు, సీ్త్రనిధి ఆర్‌ఎం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


