● నిమజ్జన ప్రాంతాలపై పోలీసుల
ప్రత్యేక దృష్టి
● బాన్సువాడ డివిజన్‌లో 1405 వినాయక మండపాలు
బాన్సువాడ : వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బాన్సువాడ డివిజన్‌లో ఐదు రోజుల నుంచి ప్రారంభమైన నిమజ్జనాల సందడి 11వ రోజుల పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శోభాయాత్ర, గణపతిని గంగమ్మ ఒడికి చేర్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్వాహకులు, భక్తులు ముందస్తు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో 1405 వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, మద్నూర్, నిజాంసాగర్ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఇటీవల ఎస్పీ రాజేశ్ చంద్ర బాన్సువాడ పట్టణంలో శోభాయాత్ర రూట్, నిమజ్జనం ప్రాంతాలను సందర్శించి నిర్వాహకులు, పోలీసులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.
మండపాల నిర్వాహణ, శోభాయాత్రలపై నిర్వాహకులతో స్థానిక పోలీసులు సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రణాళికబద్దంగా గణేశ్ ప్రతిమల నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. పటిష్ట బందోబస్తు కల్పిస్తాం.
– విఠల్‌రెడ్డి, డీఎస్పీ బాన్సువాడ


