అధ్వానం.. పల్లెప్రకృతి వనం | - | Sakshi
Sakshi News home page

అధ్వానం.. పల్లెప్రకృతి వనం

Sep 21 2026 6:47 AM | Updated on Sep 21 2026 6:47 AM

బాన్సువాడ రూరల్‌: పట్టణ ప్రజలకు మాత్రమే పరిమితమైన పచ్చని పార్కులు పల్లెల్లోనూ ఉండాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. కొన్ని గ్రామాల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా మొక్కలకు సరైన విధంగా నీటిసౌకర్యం కల్పించలేదు. దీంతో పెద్దగా పెరిగిన మొక్కలు నీటిసౌకర్యం లేక ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల పంచాయతీ పాలకులు కనీసం పట్టించుకోకపోవడంతో పార్కుల్లో గడ్డి ఏపుగా పెరిగింది. పిచ్చిమొక్కలు విపరీతంగా పెరగడంతో పాముల భయంతో అక్కడకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. కోనాపూర్‌ గ్రామంలో పార్కును సగానికి పైగా తొలగించి మైదానంగా మార్చారు. అధికారులు ఉపాధి హామీ లేదా పంచాయతీ నిధులు వెచ్చించి పార్కులకు పూర్వవైభవం తేవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement