కాంగ్రెస్‌ పరిపాలనలో విద్యా రంగం కుదేలు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పరిపాలనలో విద్యా రంగం కుదేలు

Sep 21 2026 6:47 AM | Updated on Sep 21 2026 6:47 AM

నిజామాబాద్‌ రూరల్‌: వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పరిపాలనలో విద్యా రంగం కుదేలు అయ్యిందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్‌ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సమావేశం స్థానిక నాందేవాడ లోని జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న పాత బకాయిలను విడుదల చేయాలని కోరారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులతో నిర్వహించిన హై లెవెల్‌ కమిటీ సమావేశంలో విద్యార్థులను కేకే కమిటీ సభ్యులు దుర్భాషలాడడం సరికాదని అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ పై అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ బకాయిలను ఇవ్వకుండా ప్రైవేట్‌ విద్యా సంస్థలను ఇబ్బంది చేయకూడదని అన్నారు. వెంటనే యూనివర్సిటీలకు నిధులను పెంచాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాన్ని గద్దె కూలుస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్‌, జిల్లా అధ్యక్షులు దీపికా, జిల్లా సహాయ కార్యదర్శి చక్రి, రాజు, గోవింద్‌, ఆదిత్య, యశ్వంత్‌, రాహుల్‌, వేణు, వరప్రసాద్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement