హిందీ భాష మాధుర్యం అందరికి చేరాలి | - | Sakshi
Sakshi News home page

హిందీ భాష మాధుర్యం అందరికి చేరాలి

Sep 20 2026 1:09 AM | Updated on Sep 20 2026 1:09 AM

● డీఈవో మల్లికార్జున్‌

● ఘనంగా హిందీ దివస్‌

కామారెడ్డి అర్బన్‌ : హిందీ భాష మాధుర్యాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరికి చేరాలని డీఈవో మల్లికార్జున్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా హిందీ ఫోరం ఆధ్వర్యంలో శనివారం స్థానిక వరలక్ష్మి ఫంక్షన్‌హాల్‌లో హిందీ దివస్‌ ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా డీఈవోతో పాటు శాతవాహన విశ్వవిద్యాలయం హిందీ ప్రాఫెసర్‌ వాసాల వరప్రసాద్‌ హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. హిందీ అభ్యాస దీపిక ను ఆవిష్కరించారు. అనంతరం ప్రోఫెసర్‌ వరప్రసాద్‌ మాట్లాడుతూ హిందీ ప్రాచీన భాషగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. హిందీలో ఉన్నత విద్య అభ్యసించిన వారికి ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయని అన్నారు. హిందీ దివస్‌ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. సీనియర్‌ హిందీ పండితులను సన్మానించారు. కార్యక్రమంలో హిందీ ఫోరం జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఇంద్రశేఖర్‌, సహేందర్‌నాథ్‌, ప్రతినిధులు గఫూర్‌శిక్షక్‌, అరుణ్‌కుమార్‌, చింతల లింగం, గిరి, రమేష్‌, వంశీధర్‌, పంచశీల, విద్యాశాఖ సెక్టోరీయల్‌ అధికారులు బలరాం, లింగం, వేణుశర్మ , జిల్లాలోని హిందీ పండితులు, హిందీ భాషప్రియులు హాజరయ్యారు. అలాగే కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల హిందీ విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ అధ్యక్షతన హిందీ దినోత్సవం నిర్వహించారు. హిందీ జాతీయ సమైక్యత, సంస్కృతి, జ్ఞాన సమృద్ధి అనే అంశంపై ప్రొఫెసర్‌ వరప్రసాద్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్‌ పోటీల విజేతలకు ప్రశంస పత్రాలు అందజేశారు. వైస్‌ ప్రిన్సిపల్‌ కిష్టయ్య, హిందీ విభాగాధిపతి జి.శ్రీనివాస్‌రావు, సమన్వయకర్తలు విశ్వప్రసాద్‌, జయప్రకాష్‌, సుధాకర్‌, దినకర్‌, అధ్యాపకులు బాలాజీ, రమేశ్‌ తదితరులున్నారు.

గాంధారిలో..

గాంధారి: స్థానిక ప్రభుత్వు జూనియర్‌ కాలేజీలో శనివారం హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు హిందీ అద్యాపకుడు సంబాజీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ గంగారాం మాట్లాడారు. దేశంలోని వేర్వేరు రాష్ట్రాల, వేర్వేరు భాషలను అనుసంధానం చేస్తుందన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement