కొనుగోల్‌ | - | Sakshi
Sakshi News home page

కొనుగోల్‌

Sep 20 2026 1:03 AM | Updated on Sep 20 2026 1:03 AM

ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన వడ్ల సేకరణకు కసరత్తు మొదలయ్యింది. 7.10 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్న అధికారులు.. ఇందులో 4.59 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ ధాన్యం సేకరణ కోసం 414 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

కామారెడ్డి క్రైం : జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో 3,19,361 ఎకరాల్లో వరి సాగవుతోంది. ప్రభుత్వం సన్నాల సాగుకు ప్రోత్సాహకంగా క్వింటాలు వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తుండడం, దీనిపై సీజన్‌ ప్రారంభంలో గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించడంతో రైతులు ఈసారి పెద్ద ఎత్తున సన్నాల సాగుపై దృష్టి పెట్టారు. దీంతో 2,79,027 ఎకరాల్లో సన్నరకాలు వేయగా.. 40,335 ఎకరాల్లోనే దొడ్డు రకాలు సాగవుతున్నాయి. అన్ని రకాలు కలిపి జిల్లాలో ఈసారి 7,10,661 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి కావచ్చని ఆశిస్తున్నారు. ఇందులో రైతుల అవసరాలు, బయటి విక్రయాలుపోను 4,59,295 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా గతేడాది ఖరీఫ్‌లో 4.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు.

జిల్లాలో ప్రస్తుత సీజన్‌కు సంబంధించిన వరి పంట త్వరలో చేతికి రానుంది. వ చ్చే నెల రెండో వారం నుంచి కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్లకు ముందస్తుగా ఏర్పాట్లు చే స్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తాం. – శ్రీకాంత్‌,

డీఎం, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌, కామారెడ్డి

సేకరణకు ఏర్పాట్లు..

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ముఖ్యంగా హమాలీల కొరత, రవాణా అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అక్టోబర్‌ రెండో వారంలో బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్ల పరిధిలో, నవంబర్‌ మొదటి వారం నుంచి కామారెడ్డి డివిజన్‌లో ధాన్యం సేకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా ఐకేపీ, సింగిల్‌ విండోల ఆధ్వర్యంలో మొత్తం 414 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 184, సింగిల్‌ విండోల ద్వారా 230 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వరద ముప్పు ఉన్నట్లు గుర్తించిన 34 కొనుగోలు కేంద్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే కలెక్టర్‌ అధికారులకు సూచించారు. కేంద్రాలో ధాన్యం సేకరణకు అవసరమైన ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే పరికరాలు, వేయింగ్‌ స్కేళ్లు, హస్క్‌ రిమూవర్లు ఇప్పటికే సమకూర్చారు. అదనంగా అవసరమైన టార్పాలిన్లు, ఆటోమెటిక్‌ ప్యాడీ క్లీనర్లను సమకూర్చుతున్నారు. కొనుగోలు ప్రక్రియ, నిబంధనలు, పాటించాల్సిన ప్రమాణాలపై అన్ని సొసైటీల కార్యదర్శులు, ఏపీఎంలు, సెంటర్‌ల ఇన్‌చార్జీలకు ఈనెల 22 న ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి

ధాన్యం సేకరణకు కసరత్తు

జిల్లాలో 3,19,361 ఎకరాల్లో వరి సాగు

7.10 లక్షల టన్నుల ధాన్యం

దిగుబడి అంచనా

414 కేంద్రాలను ఏర్పాటు చేయనున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement