రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

Sep 20 2026 1:03 AM | Updated on Sep 20 2026 1:03 AM

కామారెడ్డి అర్బన్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా పాలకమండలి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం అదనపు కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఎన్‌వై గిరి విడుదల చేశారు. ఈనెల 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్‌లోని రెండో నంబర్‌ గదిలో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. అదేరోజు మధ్యాహ్నం 3 తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికల గుర్తుల కేటాయిస్తామని తెలిపారు. అక్టోబర్‌ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కామారెడ్డిలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పోలింగ్‌, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటాయని పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే 99894 87624 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సహకార శాఖ సహాయ రిజిస్ట్రార్‌ ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డీజే అడ్వాన్స్‌ వాపస్‌ ఇప్పించిన పోలీసులు

మాచారెడ్డి: వినాయక విగ్రహాల నిమజ్జన శో భాయాత్ర సందర్భంగా డీజేలకు అనుమతి లేదంటున్న పోలీసులు.. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మా చారెడ్డి పోలీసులు డీజే కోసం ఇచ్చిన అడ్వాన్స్‌ను మండప నిర్వాహకులకు ఇప్పించారు. ఎస్సై విజయ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. అక్కాపూర్‌ గ్రామానికి చెందిన గడ్డం శ్రీ కాంత్‌ గణేశ్‌ శోభాయాత్ర నిమిత్తం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన లడ్డు ఆర్‌ఆర్‌ఆర్‌ డీజే ని ర్వాహకులకు 15 రోజుల క్రితం రూ. 60 వే లు చెల్లించారు. డీజేలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాంత్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఎస్సై విజయ్‌ చొరవ తీసుకొని డీజే ని ర్వాహకులతో మాట్లాడి శనివారం డబ్బులు వాపస్‌ ఇప్పించారు.

‘సాగర్‌’లోకి 3,970 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నిజాంసాగర్‌ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శనివారం నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి శనివారం 3,970 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కురిసిన వర్షాలకు ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతుండడం, హల్దీవాగు, పసుపులేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నిజాంసాగర్‌లో ఇన్‌ఫ్లో పెరుగుతోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. శనివారం సాయంత్రానికి 1,400.67 అడుగులు (12.088 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు.

రెండోరోజూ రైతుల

నిరసన

మాచారెడ్డి : పాల్వంచ మండలం ఫరీద్‌పేటలో యూరియా బస్తాలు మాయమైన ఘటనపై శనివారం వరుసగా రెండోరోజూ ఆందోళన కొనసాగింది. పీఏసీఎస్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగి యూరియా అమ్ముకొని డబ్బులు చెల్లించకపోవడంతో గందరగోళం నెలకొంది. రైతులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి ఏడీఏ అపర్ణ ఫరీద్‌పేటకు చేరుకొని రైతులతో మాట్లాడారు. సదరు ఉద్యోగినుంచి డబ్బులు రికవరీ చేశామని సొసైటీ అధికారులు తెలిపారు. దీంతో రైతులు శాంతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement