అంగన్‌వాడీ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ బియ్యం పట్టివేత

Sep 17 2026 1:20 AM | Updated on Sep 17 2026 1:20 AM

అంగన్‌వాడీ బియ్యం పట్టివేత పాఠశాలకు డెస్కుల విరాళం

బిచ్కుంద: మండలంలోని గుండెనెమ్లిలో అంగన్‌వాడీ కేంద్రం నుంచి అక్రమంగా బియ్యం తరలిస్తుండగా గ్రామస్తులు బుధవారం పట్టుకున్నారు. అంగన్‌వాడీ టీచర్‌ శ్వేత భర్త బైక్‌ పై సెంటర్‌లో ఉన్న బియ్యాన్ని ఎవరికీ తెలియకుండా అక్రమంగా యాభై కిలోల బియ్యాన్ని తీసుకెళ్తుండగా స్థానికులు అడ్డుకొని పట్టుకున్నారు. అనంతరం ఐసీడీఎస్‌ సుపర్‌వైజర్‌ కళావతికి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి మున్సిపాలిటి పరిధి గండిమాసానిపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన దినేష్‌గౌడ్‌ బుధవారం డెస్కులను అందించినట్లు హెచ్‌ఎం రాజులు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు సరిపడా బెంచీలు లేక పోవడంతో దినేష్‌గౌడ్‌ స్పందించి రూ. 80 వేల విలువ చేసే డెస్కులను అందించారు. దినేష్‌గౌడ్‌కు విద్యార్థులు, టీచర్లు కృతజ్ఞతలు తెలిపారు.

ఆలయ అభివృద్ధికి..

మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం బుధవారం కోడిచర్ల గ్రామానికి చెందిన సంకరి అశోక్‌, కళ్యాణి దంపతులు రూ. పదివేల విరాళాన్ని అందజేశారు. ఆలయ అర్చకుడు పరందామాచార్యులు దాతలకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement