ఆర్వోబీ నిర్మాణానికి నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

ఆర్వోబీ నిర్మాణానికి నిర్ణయం

Sep 17 2026 1:02 AM | Updated on Sep 17 2026 1:02 AM

ఆర్వోబీ నిర్మాణానికి నిర్ణయం నేడు ప్రజాపాలన దినోత్సవం లెండి ప్రాజెక్టును పూర్తి చేయాలి నేడు ఆర్ట్స్‌ కళాశాలలో కానిస్టేబుల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫాంపాండ్‌లు నిర్మించుకోవాలి

● ఇప్పటికే గెజిట్‌ విడుదల

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ రైల్వే గేటు స్థానంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జీ (పై వంతెన) నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ ఏడాది జూలై 9 తేదీతో గెజిట్‌ కూడా విడుదలయ్యింది. అవసరమైన భూసేకరణకు కాంపోనెంట్‌ అథారిటీగా కామారెడ్డి రెవెన్యూ డివిజనల్‌ అధికారిని నియమించారు. అందులో భాగంగానే వంతెన నిర్మించాల్సిన చోట కొలతలు వేసి మార్కింగ్‌ ఇచ్చారు. మార్కింగ్‌ చేయడాన్ని గమనించిన తర్వాత ఇళ్లు, ప్లాట్ల యజమానులు తమకు తీరని అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణ స్థలాన్ని మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతటితో ఆగకుండా జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీని కలిసి విన్నవించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని వారిద్దరు భరోసా ఇచ్చారు. అయితే ఇప్పటికే గెజిట్‌ కూడా విడుదలైన నేపథ్యంలో ఇళ్లు, ప్లాట్ల యజమానుల్లో ఆందోళన నెలకొంది.

● ముఖ్య అతిథిగా వీహెచ్‌

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఈ నెల 17న కలెక్టరేట్‌లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వేడుకలకు ప్రభుత్వ బీసీ సంక్షేమం, అభివృద్ధి సలహాదారు వి.హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.

నిజామాబాద్‌లో..

నిజామాబాద్‌ అర్బన్‌: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శర్‌రెడ్డి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ఉదయం 10గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

నిజాంసాగర్‌: ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌ ఉన్న అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్‌ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తలాపునే నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఉన్నప్పటికి జుక్కల్‌ నియోజకవర్గానికి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లెండి ప్రాజెక్టు పనులపై చొరవ చూపుతున్నారన్నారు. జుక్కల్‌ నియోజకవర్గ రైతులు పండిస్తున్న పప్పు దినుసులు, బొప్పాయి, ఆయిల్‌పామ్‌ విక్రయాలకు మార్కెట్‌ సదుపాయం కల్పించాలని కోరారు.

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో కానిస్టేబుల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు కళాశాల కాంపిటేటీవ్‌ కోచింగ్‌ కన్వీనర్‌ కిష్టయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే స్క్రీనింగ్‌ పరీక్షకు హాజరు కావాలని తమ కళాశాల విద్యార్థులకు సూచించారు. ఎంపికై నవారికి ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.

బీబీపేట: రైతులు తమ పొలాల్లో ఫాంపాండ్‌లను నిర్మించుకోవాలని జెడ్పీ సీఈవో చందర్‌ నాయక్‌ సూచించారు. బుధవారం మండల కేంద్రంలో రైతు నిర్మించుకున్న ఫాంపాండ్‌ను పరిశీలించారు. ఫాంపాండ్‌లతో భూగర్భ జలాలు పెరుగుతాయని, చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. అనంతరం మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో గంగాధర్‌, ఎంపీవో అబ్బాగౌడ్‌, సర్పంచ్‌ సాద్విక తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement