ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి

Sep 17 2026 1:02 AM | Updated on Sep 17 2026 1:02 AM

● కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డి క్రైం: జిల్లాలో ఽఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ధాన్యం కొనుగోళ్ల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 7,10,661 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాలున్నాయన్నారు. అందులో 4,59,295 టన్నులను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యమన్నారు. కొనుగోలు ప్రక్రియ, నిబంధనలపై అన్ని సొసైటీల కార్యదర్శులు, ఏపీఎంలు, సెంటర్‌ల ఇన్‌చార్జీలకు ఈ నెల 22న ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇప్పటివరకు దాదాపు 70 వేల టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదాములను గుర్తించామన్నారు. అదనంగా కర్ణాటకలోని బీదర్‌ పరిసర ప్రాంతాల్లో కూడా ధాన్యం నిల్వకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటునకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అలాగే ధాన్యం రవాణాకు వినియోగించే వాహనాలన్నీ ఈ నెల 25లోగా జీపీఎస్‌ సదుపాయంతో సిద్ధంగా ఉండేలా రవాణా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.

అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైడ్‌ గ్రాంట్ల ద్వారా ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వాటర్‌ వర్క్స్‌కు సంబంధించిన పనులను చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో చందర్‌, అదనపు కలెక్టర్‌ గిరి, డీపీవో మురళి, డీఈవో మల్లికార్జున్‌, డీఎంహెచ్‌వో వెంకట్‌, డీడబ్ల్యూవో ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement