గెలుపోటములు సహజం | - | Sakshi
Sakshi News home page

గెలుపోటములు సహజం

Sep 17 2026 1:02 AM | Updated on Sep 17 2026 1:02 AM

గెలుపోటములు సహజం

మాచారెడ్డి: ఆటల్లో గెలుపోటములు సహజమని, వాటిని క్రీడాకారులు సమానంగా తీసుకోవాలని డీఈవో మల్లికార్జున్‌ పేర్కొన్నారు. బుధవారం చుక్కాపూర్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎస్జీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాస్థాయి 70వ సెపక్‌ తక్రా పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎదగాలని సూచించారు. 18 మండలాల నుంచి 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో దేవేందర్‌రావు, ఎస్జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీధర్‌, పీడీ రసూల్‌, సర్పంచ్‌ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి సెపక్‌ తక్రాకు 20మంది ఎంపిక

పోటీలలో సత్తాచాటినవారికి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని ఎస్జీఎఫ్‌ ప్రతినిధులు తెలిపారు. అండర్‌ 14 విభాగంలో ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలను, అండర్‌ 17 విభాగంలో ఐదుగురు బాలు రు, ఐదుగురు బాలికలను ఎంపిక చేశామన్నారు.

20న జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు..

కామారెడ్డి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 20న ఉదయం 8గంటలకు జిల్లా స్థాయి జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ అండర్‌–14, 16, 18, 20 మెన్‌, ఉమెన్‌ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ తెలిపారు. రన్స్‌, త్రోస్‌, జంప్స్‌ అంశాల్లో ఎంపికలుంటాయని, ప్రతి పాఠశాల నుంచి ఒక్కో అంశం, విభాగంలో ఇద్దరు క్రీడాకారులకు మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. క్రీడాకారులు పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ లేదా పదో తరగతి మెమోతో రావాలని సూచించారు.

క్రీడా సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement