భిక్కనూరు: సార్ యాదికొస్తున్నావు.. నీవు నేర్పిన పాఠాలు, క్రమశిక్షణ ఎప్పటికి మరువలేమంటూ భిక్కనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు కంట తడిపెట్టారు. స్థానిక బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శ్రీనాథ్ గుండెపోటుతో మృతి చెందడంతో పూర్వ విద్యార్థులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం పాఠశాల ఆవరణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. శ్రీనాథ్ పాఠశాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాజ సింహారెడ్డి, అఖిల్, జాన్ హరిచరణ్, చంద్రశేఖర్, అశ్విత్ , శ్రేయస్, అఖిల్ పాల్గొన్నారు.


