తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం బీపీఎడ్–2026 2వ, 4వ సెమిస్టర్, బీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ చాన్స్‌లర్ టీ యాదగిరిరావు వర్సిటీ రిజిస్ట్రార్ ఎం యాదగిరి, కంట్రోలర్ కే సంపత్‌కుమార్‌తో కలిసి మంగళవారం విడుదల చేశారు. బీపీఎడ్ 4వ సెమిస్టర్ ఫలితాల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ తెలిపారు. బీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 1,334 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 241 మంది బాలురు, 1,093 మంది బాలికలు ఉండగా 1,173 మంది ఉత్తీర్ణత సాధించారు. బీపీఎడ్ 2వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం వంద మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 52 మంది బాలురు, 48 మంది బాలికలు ఉన్నారని, వారిలో 90 మంది ఉత్తీర్ణత సాధించారు.


