బాన్సువాడ రూరల్: వినాయక చవితి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ సూచించారు. మంగళవారం ఆయన గట్టుమీది గ్రామాల్లో పర్యటించి వినాయక మండప నిర్వాహకులకు పలుసూచనలు చేశారు. ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా పోలీస్ శాఖ సూచించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కోనాపూర్, హన్మాజీపేట్ సర్పంచ్‌లు కిష్టవ్వ దిల్‌రాజు, లావణ్య వెంకగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో గణేశ్ నిమజ్జన రూట్ పరిశీలన
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రూట్‌ను ఆర్డీవో ప్రభాకర్, డీఎస్పీ శ్రీనివాస్‌రావులు మంగళవారం పరిశీలించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులతో చర్చించారు. తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, ట్రాన్స్‌కో ఏఈ వెంకటస్వామి, కౌన్సిలర్ సిద్ది శ్రీధర్ తదితరులున్నారు.
ఎల్లారెడ్డిరూరల్: రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలకు ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి శ్రీనివాస్ ఎంపికై నట్లు ప్రిన్సిపల్ నాగేశ్వర్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఖో– ఖో పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అండర్ 17 విభాగంలో ఖో– ఖో లో రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీనివాస్‌ను ఉ పాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
లింగంపేట: మహిళల ఆరోగ్య రక్షణపై మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సి బ్బందికి ఎల్లారెడ్డి డివిజన్ సీహెచ్‌వో ఠాగూర్ అవగాహన కల్పించారు. లింగంపేట ప్రాథమి క ఆరోగ్య కేంద్రంతో అమ్మ ఒడి, ఆరోగ్య మ హిళా, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. జాతీయ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. మండల వైద్యాఽధికారి హిమబిందు,రమేశ్,వెంకటనారాయణ,ఫారీదా,చంద్రకళ,యాదగిరి,సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, అధ్యాపకులతో కలిసి ‘బీసీ కలాల అలయ్ బలయ్’ కార్యక్రమ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 20న బీసీ రచయితల సమాఖ్య తరఫున ‘బీసీ కలాల అలాయ్ బలాయ్’ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. అధ్యాపకులు శంకరయ్య, చంద్రకాంత్, జంగం శివకుమార్, సిద్ధురాజు, సురేశ్ రెడ్డి, లక్ష్మణ్, నరేశ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


