● 17న తండాల్లో నిరసనలు
● మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
బాన్సువాడ: గడిచిన వెయ్యి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాన్సువాడలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఈనెల 17న తండాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో గిరిజనుల కోసం రూ.28 వేల కోట్లు ఖర్చు చేసిందని, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గిరిజనుల అభివృద్ధి మరిచి మోసం చేసిందన్నారు. సేవాలాల్, లంబాడ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్న రేవంత్‌రెడ్డి వారిని పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం పలువురు నాయకులు ఆయన సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. నాయకులు షేక్ జుబేక్, మోరిల్ శ్రీనివాస్‌రావు, అంజిరెడ్డి, రాంచందర్, ఎర్రవాటి సాయిబాబా, మోచీ గణేష్, బాడి శ్రీనివాస్, ఖలీల్, ధర్మతేజ, శివసూరి, సాయిలు, ఫేరోజ్, అందేరాజు, గాండ్ల కృష్ణ, పోల్కం గోపి, రాము, పీర్‌సింగ్, రాహుల్, కిరణ్, ఆదికేశవ్, రాంచందర్, మోహాన్, విజయ్, రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం జుక్కల్ నియోజకవర్గ స్థాయి గిరిజన నాయకుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే పాల్గొని మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం మాజీ సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. గిరిజన ప్రజలతోపాటు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 17న తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించి, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
ఎల్లారెడ్డి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్‌ఎస్ గిరిజన సంఘం నాయకులు శ్రీనివాస్ నాయక్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో గిరిజనులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా గిరిజనులను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో గిరిజనులకు చేసిందేమీ లేదన్నారు. గిరిజన బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


