అధికారులను నిలదీసిన రిటైర్డ్‌ ఉద్యోగి | - | Sakshi
Sakshi News home page

అధికారులను నిలదీసిన రిటైర్డ్‌ ఉద్యోగి

Sep 16 2026 3:43 AM | Updated on Sep 16 2026 3:43 AM

● కొన్ని నెలలుగా ఇరిగేషన్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన

● రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఫైల్‌పై

నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో అధికారులను ఓ రిటైర్డ్‌ ఉద్యోగిని నిలదీశారు. తనకు రావాల్సిన రిటైర్‌మెంట్‌ ప్రయోజనాల ఫైల్‌ను కదల్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులతో కలిసి కార్యాలయంలో మంగళవారం నిరసన చేపట్టారు. వివరాలు ఇలా.. ఇరిగేషన్‌ శాఖలో విధులు నిర్వహించిన జ్యోతి ఈ ఏడాది జూన్‌ 30న పదవీ విరమణ పొందారు. తనకు రావాల్సిన ఇంక్రిమెంట్లు, ఇతర ఉద్యోగ విరమణ ప్రయోజనాల ఫైళ్లను సిద్ధం చేయాల్సి ఉండగా, కార్యాలయ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఫైల్‌ సిద్ధం చేసేందుకు తన వద్ద డబ్బులు డిమాండ్‌ చేశారని ఆమె ఆరోపించారు. పని పూర్తి కాకపోవడంతో పెన్షన్‌ రాక, బ్యాంకు లోన్లు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో తీవ్ర అసహనానికి గురైన ఆమె కార్యాలయానికి చేరుకుని సూపరింటెండెంట్‌ భీమరాజుతో వాగ్వాదానికి దిగారు. జూనియర్‌ అసిస్టెంట్‌ అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో నిలదీశారు. తోటి ఉద్యోగులు కల్పించుకుని సూపరింటెండెంట్‌కు నచ్చజెప్పడంతో, రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితురాలు ఆందోళన విరమించారు. ఈ ఆరోపణలపై భీమరాజు వివరణ ఇస్తూ.. జ్యోతి ఫైల్‌ విషయంలో తాము ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదన్నారు. సంతకం చేయాల్సిన సంబంధిత ఉద్యోగి సెలవులో ఉండడం వల్లే ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement