‘కేసీఆర్‌ బాధ్యత వహించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ బాధ్యత వహించాలి’

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

‘కేసీఆర్‌ బాధ్యత వహించాలి’ సౌత్‌జోన్‌ బ్యాడ్మింటన్‌లో ఆరాధ్యరెడ్డి ప్రతిభ స్థల పరిశీలన ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి అరకొర నీరు.. తప్పని ఇక్కట్లు

నిజాంసాగర్‌: అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ పూర్తి బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ డిమాండ్‌ చేశా రు. మంగళవారం ఆయన మహమ్మద్‌నగర్‌ లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధుపై కఠిన చర్య లు తీసుకోవాలన్నారు. సమావేశంలో నిజాంసాగర్‌, మహమ్మద్‌నగర్‌ మండలాల పార్టీ అధ్యక్షులు ప్రజాపండరి, రవీందర్‌రె డ్డి, సర్పంచులు రమేష్‌యాదవ్‌, లక్ష్మయ్య, రఫీ, జీవన్‌, రాములు, నాయకులు ప్రవీణ్‌, బల్‌రాం, ఆకాష్‌, దత్తు, రామాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: బెంగళూరులో ఈనెల 5 నుంచి 8 వరకు నిర్వహించిన సౌత్‌జోన్‌ ఇంటర్‌ స్టేట్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో కామారెడ్డి క్రీడాకారిణి ఆరాధ్యరెడ్డి సత్తా చాటింది. అండర్‌–19 బాలికల సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాలలో అత్యంత ప్రతిభ చూపి రజత పతకాలు సాధించింది. ఆరాధ్యరెడ్డి ప్రస్తుతం తాడ్వాయి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఆమెకు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, కోచ్‌ సందీప్‌గౌడ్‌ అభినందనలు తెలిపారు.

భిక్కనూరు: మండల కేంద్రంలో మంగళవారం అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరి పర్యటించారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కోసం మండలకేంద్రంలోని శ్రీసిద్దరావేశ్వరాలయానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్‌ రేఖ, రామేశ్వర్‌పల్లి విండో చైర్మన్‌ ఇంద్రకరణ్‌రెడ్డి, తహసీల్దార్‌ సునీత, జీపీవో కాశీరాం, వార్డు సభ్యులు గజ్జె వేణు, సురేష్‌గౌడ్‌ తదితరులున్నారు.

మాచారెడ్డి: ఇంకుడు గుంతల నిర్మాణాలతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని జెడ్పీ సీఈవో చందర్‌ నాయక్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గజ్యా నాయక్‌ తండా, రాజఖాన్‌ పేట గ్రామాలలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న వీవో భవనం, కమ్యూనిటీ టాయిలెట్స్‌, అంగన్‌వాడీ భవనాలను పరిశీలించారు. కార్యక్రమాలలో సర్పంచ్‌ వినోద, ఎంపీడీవో గోపి బాబు, ఎంపీవో ప్రవీణ్‌, ఏపీవో సాయిబాబా, పంచాయతీ కార్యదర్శి దర్శన్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజేష్‌ పాల్గొన్నారు.

సదాశివనగర్‌: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నీటి కోసం విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో పాఠశాలకు రెన్యూ పవర్‌ ఫ్లాంట్‌ సంస్థ ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ సిస్టంను ఏర్పాటు చేసింది. అయితే అది కొద్ది రోజులకే మూలనపడింది. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ రెండు కుళాయిల నుంచి మాత్రమే నీరు సన్నగా వస్తోంది. ఆ నీరు పాఠశాలకు సరిపోవడం లేదు. తాగునీటితోపాటు భోజనం చేసిన తర్వాత చేతులు, ప్లేట్లు కడుక్కోవడం కోసం కూడా క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు సరిపడా నీటి సదుపాయం కల్పించాలని విద్యార్థులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement