అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది | - | Sakshi
Sakshi News home page

అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

బాన్సువాడ రూరల్‌: అన్నిదానాల కన్నా రక్తదానం గొప్పదని హ్యూమానిటీ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ ముఖ్యసలహాదారు మౌలానా మొహ్మద్‌ రిజ్వాన్‌ ఖాస్మీ అన్నారు. మహ్మద్‌ ప్రవక్త జన్మదిన మాసోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ ఏరియా ఆస్పతిలో స్థానిక హ్యూమానిటీ వెల్పేర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. రక్తదానం చేసిన 54మంది రక్తదాతలను ఆయన అభినందించారు. ఫౌండేషన్‌ చేస్తున్న సేవాకార్యక్రమాలను ఆయన కొనియాడారు. రక్తదాన శిబిరాన్ని ఆస్పత్రి సూప రింటెండెంట్‌ డా.శ్రీనివాస్‌ ప్రారంభించారు. మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌, నాయకులు అబ్దుల్‌ ఖాలేఖ్‌, మక్బూల్‌, హఫీజ్‌ షకీల్‌ ఆహ్మద్‌, హఫీజ్‌, లాయఖ్‌, ఉస్మాన్‌, ఇంతేజార్‌, అయ్యూబ్‌, సాజిద్‌, ఆరీఫ్‌, సమీర్‌, ఉబేద్‌, ఆమేర్‌, దాసరిగంగాధర్‌, బ్లడ్‌బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement