కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని వైష్ణవి మోటార్స్ బజాజ్ షోరూమ్‌లో నూతన బజాజ్ పల్సర్ వాహనాల మోడళ్లను ఆవిష్కరణ చేశారు. మంగళవారం ఆల్ న్యూ పల్సర్ 125, 150, 160 నూతన వేరియంట్లను జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు మొగిలిపల్లి భూమేశ్, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు సబ్బని కృష్ణహరి, స్థానిక ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన వాహనాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో షోరూమ్ యజమాని సోమిశెట్టి సంతోష్ కుమార్, బాలకిషన్, నవీన్, రోటరీ క్లబ్ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాళోజీ స్ఫూర్తిగా ప్రజా
అభ్యుదయ రచనలు చేయాలి
కామారెడ్డి అర్బన్: తెలంగాణ చైతన్యంతో కవిత్వం రాసిన ప్రజాకవి కాళోజీని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా అభ్యుదయం రచనలు చేయాలని తెలంగాణ రచయితల సంఘం (తెరసం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శంకర్ అన్నారు. తెరసం జిల్లా శాఖ అధ్యక్షుడు రుద్రంగి రమేష్ అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా కామారెడ్డి విజన్ జూనియర్ కళాశాలలో కవి సమ్మేళనం నిర్వహించగా ముఖ్యఅతిథిగా శంకర్ పాల్గొని మాట్లాడారు. పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారు. తెరసం జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్పని సత్యనారాయణ, ప్రతినిధులు తగిరంచ నర్సింహరెడ్డి, పెరుముల కై లాస్, వడ్ల రమేష్, పీఆర్‌కే మారుతి, పూర్ణచందర్‌రావు తదితరులున్నారు.
పద్మశాలి కార్యవర్గ సభ్యులకు సన్మానం
కామారెడ్డి టౌన్ : నూతనంగా ఎన్నికై న జిల్లా పద్మశాలి సంఘం సభ్యులను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. జిల్లా పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న సిరిగాడ లక్ష్మీనర్సింహులు, ప్రధాన కార్యదర్శి బొమ్మెర రాజయ్య, కోశాధికారి సబ్బని ధర్మపురి, పట్టణ అధ్యక్షుడు సబ్బని కృష్ణహరి, సభ్యులను శాలువాతో సత్కరించారు. సంఘం నాయకులు బాల్‌నర్సయ్య, శివరామయ్య, వెంకటస్వామి, నర్సింహస్వామి, రాజేశం, సామల రవి, బొమ్మెర భూమేష్, అల్వాల్ గోపాల్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల తనిఖీ
బాన్సువాడ రూరల్:మండలంలోని కొయ్యగుట్టలో తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంగళవారం బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు పట్టికలు పరిశీలించారు. కౌన్సిలర్ మహ్మద్ హకీమ్ , సిబ్బంది ఉన్నారు.


