ఎల్లారెడ్డి: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి డివిజన్ స్థాయి లో నిర్వహించిన గణేశ్ మండపాల నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. డీఎస్‌పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతు గణేశ్ మండపాలను ఏర్పాటు చేసుకునే వారు తప్పకుండా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. నిబంధనలకు అతిక్రమించ రాదని అన్నారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, సీఐ రాజిరెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్ ఎస్సైలు రాజు, భార్గవ్‌గౌడ్, దీపక్‌కుమార్, డీఎల్‌పీవో సురేందర్ తదితరులున్నారు.
నస్రుల్లాబాద్‌లో..
నస్రుల్లాబాద్: ప్రశాంత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సీఐ తిరుపయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నస్రుల్లా బాద్ మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కా ర్యాలయ సమావేశ మందిరంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శాంతి కమిటీ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ తిరుపయ్య మాట్లాడారు. మండల అధికారులు, ప్ర జాప్రతినిధులు, వివిధ గ్రామాల గణేశ్ మండపా ల నిర్వాహకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


