బోధన్: ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ నాలుగేళ్ల కూతురితో కలిసి తనువు చాలించింది. జానకంపేట్ ప్రాంతంలోని అశోక్‌సాగర్ నీటిపై తేలియాడుతున్న తల్లీకూతుళ్ల మృతదేహాలను చూసిన వారు కంటతడి పెట్టారు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్‌నగరంలోని హస్మీకాలనీకి చెందిన ఇమ్రానా బేగం(40) భర్త ఆసిఫ్ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లగా.. ముగ్గురు పిల్లలతో కలిసి ఇమ్రానాబేగం అత్తవారింట్లో ఉంటోంది. శారీరక వైకల్యం ఉండడంతో ఇమ్రానాబేగం మానసికంగా బాధపడుతూ ఉండేది. ఎస్‌ఐఆర్ (ఓటరు నమోదు) ఫామ్ పనిపై బయటికి వెళ్తున్నానని నాలుగేళ్ల కూతురితో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. సాయంత్రం సమయంలో అశోక్‌సాగర్ నీటిపై రెండు మృతదేహాలు తేలియాడుతున్నాయనే సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని బయటికి తీయించారు. విచారణ చేపట్టి మృతులను తల్లీకూతుళ్లు ఇమ్రానాబేగం, నేహా అజ్లిన్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీకూతుళ్ల బలవన్మరణానికి కారణాలు తెలియరాలేదు. మృతురాలి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నాలుగేళ్ల కూతురితో కలిసి
తల్లి బలవన్మరణం
అశోక్‌సాగర్‌లో తేలియాడిన
మృతదేహాలు
మృతులు నిజామాబాద్ నగరవాసులు


