ఖో–ఖో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఖో–ఖో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

కామారెడ్డి అర్బన్‌: ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా జిల్లా స్థాయి ఖో–ఖో ఎంపికలు మంగళవారం కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించగా భా రీగా క్రీడాకారులు తరలివచ్చారు. ఉమ్మడి జిల్లాల నుంచి దాదాపు 500 పైగా క్రీడాకారులు ఖోఖో ఎంపికల్లో పాల్గొనగా అత్యుత్తమ ప్రతిభ చూపిన 12 బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేశారు. అసోసియేషన్‌ చైర్మన్‌ బిల్లా అనిల్‌, ప్రధాన కార్యదర్శి అతీకుల్లా, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి నాగేశ్వ ర్‌, మోహన్‌రెడ్డిలతో ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా తరపున రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement