పల్లెకు నైట్‌హార్ట్‌! | - | Sakshi
Sakshi News home page

పల్లెకు నైట్‌హార్ట్‌!

Aug 23 2026 1:52 AM | Updated on Aug 23 2026 1:52 AM

పల్లెకు నైట్‌హార్ట్‌! 26 బస్సులు..

కామారెడ్డి నుంచి యాడారం బయలు దేరడానికి సిద్ధంగా ఉన్న నైట్‌ హాల్ట్‌ బస్సు

‘మబ్బుల ఫస్ట్‌ బస్సుకు ఎక్కి పట్నంబోతే పనంతా చేసుకుని పొద్దుమీకి ఆఖరు బస్సుకు ఇంటికి చేరుకోవచ్చు’ అనే మాట చాలా ఊళ్లలో వినిపిస్తుంది. ఎందుకంటే ఆ ఊళ్లల్లో ప్రజలకు నైట్‌ హాల్ట్‌ బస్సు మీద అంత భరోసా ఉంటుంది. దశాబ్దాలుగా కొన్ని రూట్లలో నైట్‌ హాల్ట్‌ బస్సులు నిరాటంకంగా నడుస్తున్నాయి. కోవిడ్‌ సమయంలో కొన్ని రోజులు బందు పెట్టినా కొంతకాలానికే తిరిగి ప్రారంభమయ్యాయి.

గ్రామీణ ప్రాంత ప్రజల హృదయాల్లో ఆర్టీసీ బ స్సులకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నైట్‌ హాల్ట్‌ బస్సులు గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయాణ సాధ నాలు మాత్రమే కాదు. వారి దైనందిన జీవితంలో భా గమైపోయిన నేస్తాలు. ఏళ్ల తరబడిగా పల్లెల్లో రాత్రి బ స చేసి తెల్లవారుజామునే పట్టణాల వైపు పరుగులు తీ సే ఈ బస్సులు ఎన్నో జీవితాలకు అండగా నిలుస్తు న్నాయి. పొద్దున్నే పట్టణాలకు వెళ్లేందుకు చాలా మంది రాత్రి బస చేసిన బస్సు బయలుదేరే సమయానికి బస్సు నిలిపి ఉన్న చోటుకు చేరుకుంటారు. వ్యాపారు లు, వృత్తి పనివారు, కూలీ కోసం పట్టణాలకు వెళ్లే కూ లీలు, ఫ్యాక్టరీలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు, వై ద్యం కోసం పెద్దాసుపత్రులకు వెళ్లేవారు, ఉన్నత చదు వుల కోసం పట్టణాలకు వెళ్లేవారు, ఉద్యోగస్తులు... ఇ లా గ్రామీణ ప్రజలకు నైట్‌ హాల్ట్‌ బస్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. అప్పట్లో చాలా రూ ట్లలో నైట్‌హాల్ట్‌ బస్సులు నడిచేవి. తరువాతి కాలంలో వాటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.

కామారెడ్డి నుంచి మల్కాపూర్‌కు చేరుకున్న నైట్‌ హాల్ట్‌ బస్సు నుంచి దిగుతున్న ప్రయాణికులు

కామారెడ్డి నుంచి కరడ్‌పల్లికి బయలుదేరిన

నైట్‌ హాల్ట్‌ బస్సు

నైట్‌ హాల్ట్‌ బస్సు ఆ ఊరి జనాలకు భరోసా.. తెల్లవారకముందే డ్రైవర్‌ లేచి కొట్టే హారన్‌తో పల్లె జనం మేల్కొని పనులు మొదలుపెడతారు. పట్టణానికి వెళ్లాలనుకున్నవారు వేగంగా రెడీ అయ్యి బస్టాండ్‌ వద్దకు చేరుకుంటారు. పట్టణానికి వెళ్లి, రోజంతా పనులు చూసుకుని రాత్రి పొద్దుపోయాక అదే బస్సులో తిరిగి గ్రామానికి చేరుకుంటారు. ఇది కేవలం బస్సు సర్వీసే కాదు.. స్నేహాల వారధి.. పనుల కోసమో.. ఇతర అవసరాలకోసమో రోజూ ఈ సర్వీస్‌లలో ప్రయాణించేవారు, ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్ల మధ్య ఆత్మీయ అనుబంధం ఉంటుంది. కాలం మారుతున్నా ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఈ నైట్‌హాల్ట్‌ బస్సుకు ప్రాధాన్యత తగ్గడం లేదు. పల్లెటూరి గుండెచప్పుడుగా మారిన నైట్‌హాల్ట్‌ బస్‌ సర్వీస్‌లతో ప్రజల అనుబంధంపై సండే స్పెషల్‌.. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

కామారెడ్డి డిపో నుంచి ప్రస్తుతం రెండు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, పది పల్లె వెలుగు బస్సులు నైట్‌ హాల్ట్‌గా నడుపుతున్నారు. బీబీపేట మండలం యాడారం గ్రామంలో ఓ బస్సు నైట్‌ హాల్ట్‌ చేసి ఉదయమే కామారెడ్డికి ప్రయాణికులను తీసుకుని వస్తుంది. అలాగే సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒకటి నైట్‌హాల్ట్‌ చేస్తుంది. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి, రాజంపేట మండలం గుండారం, తాడ్వాయి మండలం కరడ్‌పల్లి, మెదక్‌ జిల్లా రామాయంపేట, నిజాంసాగర్‌, పిట్లం, ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌కు నైట్‌ హాల్ట్‌ బస్సులు ఉన్నాయి. అలాగే బీబీపేట మండలం మల్కాపూర్‌ నుంచి జేబీఎస్‌కు ఎక్స్‌ప్రెస్‌ నడుపుతున్నారు. మరో బస్సు బీబీపేట నుంచి జేబీఎస్‌కు నడుస్తోంది. బాన్సువాడ డిపో నుంచి 14 నైట్‌ హాల్ట్‌ బస్సులు నడుస్తున్నాయి. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు రెండు సర్వీసులు, కర్ణాటకలోని ఔరాద్‌కు ఒకటి, పెద్దకొడప్‌గల్‌ మండలం విఠల్‌వాడీకి ఒకటి, నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట, జుక్కల్‌ మండలం గుండూరు, వర్ని మండలం బడాపహడ్‌తో పాటు హైదరాబాద్‌కు రెండు సర్వీసులు నడుస్తున్నాయి.

ఆ బస్సుంటే భరోసా

తెల్లవారకముందే పట్నానికి వెళ్లొచ్చు

పనులు ముగించుకుని రాత్రికి

తిరుగు ప్రయాణానికి అనుకూలం

బస్సు డ్రైవర్లు, కండక్టర్లతో

గ్రామస్తులకు ప్రత్యేక అనుబంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement