మొదటిసారి చూస్తున్నా..
కామారెడ్డి టౌన్: పండుగల సీజన్ ప్రారంభమైన వేళ సామాన్యులకు ధరల సెగ తగులుతోంది. నిత్యావసరాల్లో ప్రధానమైన చక్కెర ధర మార్కెట్‌లో ఒక్కసారిగా భగ్గుమంటోంది. వారం వ్యవధిలోనే కిలో చక్కెరపై రూ.15 నుంచి రూ.20 వరకు ధర పెరగడంతో వినియోగదారులతోపాటు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఎగబాకిన ధరలు..
నెల రోజుల క్రితం మార్కెట్‌లో కిలో చక్కెర ధర రూ.42 ఉండగా ప్రస్తుతం రూ.72 చేరింది. హోల్‌సేల్‌లో కిలో రూ. 70కి విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సాధారణ రోజుల్లో నెలకు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల కిలోల చక్కెర వినియోగం జరుగుతుండగా, పండుగల వేళ స్వీట్లు, పిండివంటల తయారీ కారణంగా మరో 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతుంది. సరిగ్గా డిమాండ్ పెరిగే సమయంలోనే ధరలు ఆకాశాన్నంటడం పేద, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పండుగల వేళ.. ధరల సెగ
నెల క్రితం కిలోకు రూ. 42
వారం రోజుల్లో కిలోపై రూ.15 నుంచి
రూ.20 వరకు పెరుగుదల
నేను 25 ఏళ్లుగా కిరాణా దుకాణం నిర్వహిస్తు న్నా. చక్కెర ధరలు అమాంతంగా పెరగడం మొదటి సారి చూస్తున్నా. పండుగల వేళ మాలాంటి చిన్న దుకాణాదారులకు నష్టమే. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఆర్థిక భారమే.
– భరత్‌కుమార్, కిరాణం వ్యాపారి, కామారెడ్డి


