బలవంతపు ప్లాంటేషన్‌ ఆపాలి | - | Sakshi
Sakshi News home page

బలవంతపు ప్లాంటేషన్‌ ఆపాలి

Aug 23 2026 1:52 AM | Updated on Aug 23 2026 1:52 AM

బలవంతపు ప్లాంటేషన్‌ ఆపాలి

అటవీశాఖ కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా

కామారెడ్డి టౌన్‌: గిరిజనుల పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు చేపడుతున్న బలవంతపు ప్లాంటేషన్‌ను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయాన్ని గిరిజనులతో కలిసి ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్‌ మాట్లాడుతూ నిరుపేద గిరిజనులు వారసత్వంగా ఆధీనంలో ఉంచుకొని సాగు చేసుకుంటున్న భూములను అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. గిరిజనులకు హక్కుగా రావాల్సిన భూములను వారికి అప్పగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు డి మాండ్‌ చేశారు. స్పందించిన అటవీ శాఖ అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్‌, నాయకులు, గిరిజనులు సుభా ష్‌, రమేశ్‌, గణేశ్‌, సీట్యా, కమల, సరోజ, శారద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement