ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర స్థాయి 45వ సబ్ జూనియర్ బాల్‌బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు బాల్‌బ్యాడ్మింటన్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రావణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యాం శనివారం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హైస్కూల్ మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించగా 130 మంది క్రీడాకారులు పోటీ పడగా.. ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారు లు ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు సంగారెడ్డి జిల్లా బీహెచ్‌ఈఎల్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని శ్రావణ్ తెలిపారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సునీత, కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగేశ్, సభ్యులు సురేశ్, విజయ్ హైస్కూల్ కరస్పాండెంట్ కవిత దివాకర్, హెచ్‌ఎం రమాదేవి, సీనియర్ క్రీడాకారులు ఆనంద్, కార్తీక్, సాయికుమార్, శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్యామల, మహేశ్, యూ మహేశ్, శివ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


