కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌కు నివేదించాం | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌కు నివేదించాం

Jul 31 2026 12:51 AM | Updated on Jul 31 2026 12:51 AM

ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ముకుంద రెడ్డి

కామారెడ్డి క్రైం: సలాబత్‌పూర్‌ చెక్‌పోస్ట్‌ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించడంతోపాటు కానిస్టేబుల్‌ సుధాకర్‌ రెడ్డిని సస్పెండ్‌ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ముకుంద రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. బుధవారం సాయంత్రం రాజస్థాన్‌ నుంచి వచ్చిన ఒక ట్రక్‌లో ప్రయాణిస్తున్న యూ ట్యూబర్‌ చెక్‌పోస్ట్‌ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సందర్భంగా వివాదం చోటుచేసుకుందని తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో వెంటనే ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను సుధాకర్‌ రెడ్డిగా గుర్తించినట్లు తెలిపారు. శాఖాపరమైన పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుందని, విచారణ నివేదికను కరీంనగర్‌ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి (నోడల్‌ అధికారి)కి సమర్పిస్తామని పేర్కొన్నారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయా లని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement