ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్‌ కార్డులు, పింఛన్‌లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరు లాంటి ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి, సమస్యలను పరిష్కరించాలన్నారు. , ఫిర్యాదులు పెండింగ్‌ లేకుండా చూసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్‌, గిరి, డీఆవ్వో పాండు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

ప్రజావాణిలో

65 వినతుల స్వీకరణ

Advertisement
 
Advertisement
Advertisement