● పలు చోట్ల అమ్మవారికి బోనాలు
● ఆలయాల్లో భక్తుల రద్దీ
జిల్లాకేంద్రంతోపాటు జిల్లావ్యాప్తంగా ఉగాది పండుగ సందర్భంగా ఎడ్లబండ్ల, ట్రాక్టర్లను ఆలయాల చుట్టూ తిప్పారు. పలు చోట్ల పోచమ్మ ఆమ్మవారికి బోనాలు తీసి భక్తులు మొక్కులు చెల్లించారు. నాగిరెడ్డిపేట మండలకేంద్రం గోపాల్‌పేటలో నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు ఉగాది రోజూ ప్రారంభమయ్యా యి. మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి, తాడ్వాయి మండలాల పోలీసులు బందోబస్తు నిర్వహించారు. –సాక్షి, నెట్‌వర్క్


