రెంజల్: మండలంలోని బోర్గాం గ్రామంలో ని ర్వహించిన కుస్తీ పోటీల్లో ఢిల్లీకి చెందిన మహిళ పాల్గొని, అబ్బురపరిచింది. ఉగాది పండుగ సందర్భంగా గురువారం స్థానిక హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. పోటీల్లో స్థానిక మల్లయోదుడి తో ఢిల్లీకి చెందిన బంజిత్‌కౌర్ తలపడి, లేడీ ప హిల్వాన్‌గా విజయం సాధించారు. బంజిత్‌కౌ ర్ తలపడుతున్న సమయంలో స్థానికులు ఆమె ను చప్పట్లు, ఈలలతో ప్రోత్సహించారు. ఆమె కు నిర్వాహాకులు రూ.2 వేల నగదును అందించారు. ఫైనల్ కుస్తీలో మహారాష్ట్రకు చెందిన ప్రభాకర్ విజయం సాధించగా విజేతకు రూ.5 వేలను అందించారు. అనంతరం బంజిత్‌కౌర్ దంపతులు మాట్లాడుతూ.. కుస్తీ పోటీలపై ఉన్న ఆసక్తి కారణంగా మండలంలో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు రెండు సంవత్సరాలుగా వస్తున్నట్లు పేర్కొన్నారు.
శివాజీ విగ్రహ
ఏర్పాటుకు భూమిపూజ
బోధన్‌రూరల్: మండలంలోని పెగడాపల్లి గ్రామంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు గ్రామ పెద్దలు, యువకులు గురువారం భూమిపూజ నిర్వహించారు. త్వరలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: మండలంలోని మల్కాపూర్ తండాలో జగదాంబ సేవాలాల్ రామ్‌రావు మహరాజ్ ఆలయ ఉత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకుడు పిట్ల కృష్ణ మహరాజ్, పౌరదేవి పీఠాధిపతి బాబుసింగ్ మహరాజ్‌లు ముఖ్యఅతిథిలుగా హాజరై ఆలయాల వద్ద నిర్వహించిన భోగ్‌బండార్‌లో పాల్గొన్నారు. ఉగాదిని పురస్కరించుకొని ప్రతి ఏడాది మల్కాపూర్ తండా, జగదాంబ ఆలయాల వార్షికోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. పిట్ల కృష్ణ మహరాజ్, బాబుసింగ్ మహరాజ్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రవచనాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.


