ఎల్లారెడ్డిరూరల్: ఉపాఽధిహామీ కూలీలకు ఉపాధి కల్పించే సిబ్బందికి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల నుంచి వేతనాలు రాక కుటుంబాల పోషణ భారంగా మారిందని ఉపాధిహామీ కంప్యూటర్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 22 మంది కంప్యూటర్ ఆపరేటర్లు ..
జిల్లాలో 2 లక్షల 48 వేల 423 జాబ్ కార్డులు ఉండగా వీటి పరిధిలో 4 లక్షల 68 వేల 500 మంది కూలీలు ఉన్నారు. ఉపాధిహామీ ఏపీవో, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి కూలీలకు పనులు కల్పిస్తారు. పనులకు సంబంధించిన వివరాలను కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. జిల్లాలో 22 మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరికి గత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అరకొర వేతనాలు ఉన్న తమకు కుటుంబ పోషణ భారంగా మారిందని వారు వాపోతున్నారు. అధికారులు స్పందించి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉపాధి సిబ్బంది వివరాలను నమోదు చేసే కంప్యూటర్ ఆపరేటర్లకు...
మూడు నెలల నుంచి ఇబ్బందులు
అధికారులు స్పందించాలని వేడుకోలు


