తాడ్వాయి/లింగంపేట/బాన్సువాడ రూరల్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు కృష్ణాజీవాడి, సంగోజీవాడి, చందాపూర్, బ్రాహ్మణపల్లి, ఎర్రాపహాడ్, దేమికలాన్ గ్రామాలలో గురువారం ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. లింగంపేట మసీద్‌లలో రంజాన్ తోఫాలు ముస్లింలకు మహిళలకు అందజేశారు. టీపీసీసీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫియోద్దీన్ మాట్లాడారు. బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో సర్పంచ్ అందెరమేష్, దేశాయిపేట్‌లో జ్యోతీప్రకాష్, హన్మాజీపేట్‌లో లావణ్య వెంకాగౌడ్, పోచారం గ్రామంలో రమేష్‌నాయక్, ఇబ్రహీంపేట్ గ్రామంలో ఉద్దర సంధ్యారాణి ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు రెడ్ క్రాస్ సొసైటీ బాన్సువాడ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. రంజాన్ పండుగను ఆనందరంగా జరుపుకోవాలన్నారు. బాన్సువాడ మండలం బోర్లం, ఇబ్రాహీంపేట్, సంగోజీపేట్ తదితర గ్రామాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.


