కామారెడ్డి టౌన్: జిల్లాలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.60 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కోరారు. ఈ మేరకు గురువారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విద్యార్థి సంఘాల నాయకులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. బకాయిల వల్ల సర్టిఫికెట్లు రాక విద్యార్థులు, జీతాలు ఇవ్వలేక కళాశాలల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని వారు వివరించారు. దీనిపై షబ్బీర్ అలీ వెంటనే స్పందిస్తూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఫోన్‌న్‌లో మాట్లాడారు. ఈ వారంలోనే విద్యార్థి ప్రతినిధులను హైదరాబాద్ తీసుకెళ్లి డిప్యూటీ సీఎంను కలిపి సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.


