సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని కాశీవిశ్వేశ్వర స్వామి కల్యాణ వేడుకల్లో భాగంగా గురువారం రుద్రహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, అఖండ దీపారాధన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు వేదబ్రాహ్మణుడు సంతోష్‌కృష్ణ శర్మ తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ జోగిని రాజయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు బద్దం రాజిరెడ్డి, నడిపి గంగయ్య, గాదారి భూమయ్య, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలం కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలను గురువారం ఎంఈవో అంజల్‌రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం రావాలని.. విద్యార్థులు ప్రతీ రోజు బడికి వచ్చేలా చూడాలన్నారు. మధ్యాహ్న భోజనం రుచికరంగా వండాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. ఉపాధ్యాయులు శైలజ ఉన్నారు.


