● ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
మాక్లూర్: కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆలూర్ మండలం గుత్ప గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి ప్ర మాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుత్ప గ్రామానికి చెందిన బైరి పెద్ద నారాయణ (31), క్యాసెల్ ప్రవీణ్ బుధవారం అర్ధరాత్రి కారులో గుత్ప నుంచి ఆలూ ర్ వైపు వెళ్తున్నారు. గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న కాల్వ వద్ద కారు అదుపుతప్పి పడిపోయింది. దీంతో డ్రైవింగ్ సీటులో ఉన్న నారాయణ అక్కడికక్కడే మృతి చెందగా, ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డా డు. విషయం తెలిసిన గ్రామస్తులు ఘటనా స్థలాని కి చేరుకొని ప్రవీణ్‌ను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వటంతో మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ ఘట నా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుడు నారాయణకు వివాహం జరిగి విడాకులు అయ్యాయి. గాయపడ్డ ప్రవీణ్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.


