సదాశివనగర్(ఎల్లారెడ్డి):మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామంలో గురువారం మఽ ద్యాహ్నం ఓ పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. గ్రామంలోని సున్నపు రాజు నివాసపు ఇల్లు షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై పుష్పరాజ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఏఆర్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ వినయ్ ఇంట్లో ఉన్నవారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. చుట్టు పక్కల మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో పూర్తిస్థాయిలో మంటలను ఆర్పించినట్లు ఎస్సై పుష్పరాజ్ పేర్కొన్నారు.


